హాలీవుడ్‌ సినిమాకి జగపతి వాయిస్‌!

- July 01, 2016 , by Maagulf
హాలీవుడ్‌ సినిమాకి జగపతి వాయిస్‌!

కథానాయకుడిగా ఎన్నో విజయాలను అందుకున్న జగపతిబాబు ప్రతినాయకుడిగా కూడా చక్కగా ఆకట్టుకుంటున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్న ఆయన తాజాగా ఓ హాలీవుడ్‌ చిత్రానికి వాయిస్‌ను అందించటం విశేషం. 

హాలీవుడ్‌ లెజెండరీ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తాజాగా తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రం బీఎఫ్‌జీ 'ద బిగ్‌ ఫ్రెండ్లీ జెయింట్‌' శుక్రవారం అమెరికాలో విడుదలైంది. ఈ చిత్రాన్ని భారత్‌లోనూ ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. జులై 15న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా మూడు తెలుగు పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. 'నువ్వు వూహించిన దాని కంటే ఈ ప్రపంచము చాలా పెద్దది' అంటూ పోస్టర్లపై ఉన్న అక్షరాలు చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి. టాలీవుడ్‌ నటుడు జగపతిబాబు ఈ చిత్రానికి గాత్రం అందించారు. రచయిత రోల్డ్‌ దాల్‌ రాసిన బిగ్‌ ఫ్రెండ్లీ జెయింట్‌ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com