ఉగ్రవాదాన్ని అణిచివేతకు కృషిచేస్తాం: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
- July 02, 2016
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఇది తీవ్రమైన దుశ్చర్యగా ఆమె పరిగణించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి మతమనేదే లేదని.. వారిని ప్రజలు అడ్డుకోవాలని హసీనా అన్నారు. బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
ఢాకాలోని గుల్షన్‌లో ఓ రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు శుక్రవారం దాడి చేసిన విషయం తెలిసిందే. రెస్టారెంట్లోకి చొరబడి ప్రజలను బందీలుగా చేసుకున్నారు. దీంతో భద్రతాబలగాలు చుట్టుముట్టి ఉగ్రవాదులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు ముష్కరులు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను సురక్షితంగా విడిపించారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









