ఏపీలో శివరాత్రికి 3,500 ప్రత్యేక బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ

- February 14, 2025 , by Maagulf
ఏపీలో శివరాత్రికి 3,500 ప్రత్యేక బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ

అమరావతి: ఏపీలో మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖమైన 99 శైవ క్షేత్రాలకు భక్తులు వెళ్లి వచ్చేందుకు వీలుగా 3,500 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లాలో 12 క్షేత్రాలకు, నెల్లూరు జిల్లాలోని 9 క్షేత్రాలకు, తిరుపతి జిల్లాలో 9 క్షేత్రాలకు, నంద్యాల జిల్లాలో 7 క్షేత్రాలకు బస్సులు తిప్పనున్నట్లు పేర్కొంది. మొత్తంగా ఈ ప్రత్యేక బస్సుల ద్వారా రూ.11 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com