విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ సమీక్ష
- February 14, 2025
హైదరాబాద్: యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. తక్షణమే అనువైన స్థల సేకరణ చేపట్టాలని విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంద నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సరైన ప్రత్యామ్నాయాలు చూడాలి..
ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సీఎం సూచించారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలన్నారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలని చెప్పారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వందశాతం పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.
వీరనారి చాకలి అయిలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని సీఎం రేవంత్ సూచించారు. ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముగిసిన స్పష్టం చేశారు. అనంతరం పర్యాటక శాఖపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









