కార్లు ఢీ.. ట్రాఫిక్‌ను అడ్డుకోవద్దని యూఏఈ పోలీసులు హెచ్చరిక..!!

- February 15, 2025 , by Maagulf
కార్లు ఢీ.. ట్రాఫిక్‌ను అడ్డుకోవద్దని యూఏఈ పోలీసులు హెచ్చరిక..!!

యూఏఈ: యూఏఈలో వాహనదారులు చిన్న ప్రమాదానికి గురైతే రోడ్డు పక్కనకు వెళ్లాలని పోలీసులు కోరారు. అబుదాబి పోలీసులు శుక్రవారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో ఈ మేరకు తెలిపారు. చిన్న ప్రమాదానికి గురైన వాహనాలను సమీపంలోని సురక్షిత పార్కింగ్ స్థలానికి తరలించాలని అందులో కోరారు. అథారిటీ షేర్ చేసిన వీడియోలో..మొదటి చిన్న కారు ప్రమాదం తర్వాత అనేక కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఢీకొన్న తర్వాత వాహనాలు రోడ్డుపై ఆగిపోవడంతో, ఎదురుగా వచ్చే వాహనాలు సకాలంలో ఆపలేకపోవడం లేదా రోడ్డు నుండి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది.
చిన్న ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో పోలీసులు సూచనలను అందించారు. 
ముందుగా, కారును సురక్షితమైన ప్రదేశానికి తరలించాలి. ఆ తర్వాత సయీద్ యాప్‌ని ఉపయోగించి ప్రమాద సంఘటనను 800 72233 కు కాల్ చేసి నివేదించవచ్చు. చిన్న ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డుపైనే ఉండటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. ఇది ఆర్టికల్ 98 ప్రకారం శిక్షార్హమైన నేరం. ఉల్లంఘించిన వ్యక్తిపై దిర్హామ్‌లు 500 జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com