సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం: హోం మంత్రి అనిత
- February 17, 2025
శ్రీకాళహస్తి: రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పలు బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా నిర్వహించుటకు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శన భాగ్యం కల్పించాలని ముందస్తుగా మంత్రుల బృందం ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించి పక్కాగా జరిగేలా చూడాలని ఇచ్చిన ఆదేశాలు మేరకు సమీక్షిస్తూ శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని హోం శాఖ మంత్రి వర్యులు వంగల పూడి అనిత పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం సమావేశ మందిరం నందు రానున్న మహాశివరాత్రి 2025 ఏర్పాట్లపై హోం శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఈ.ఓ బాపిరెడ్డీ,ఎంఎల్ఏ బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి లతో కలిసి పలు శాఖల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్య భక్తులకు మంచి దర్శనం కలిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికంగా భక్తులు రానున్న నేపథ్యంలో ప్రణాళికలు పక్కాగా ఉండాలని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి గారు అత్యంత జాగ్రత్త గా చేపట్టాలని ఆదేశించి ఉన్నారని తెలుపుతూ రెవెన్యూ,పోలీస్, దేవాదాయ శాఖ పలు శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని, వీఐపీ ల దర్శనాలకు టైం స్లాట్ ఏర్పాటుకు సమీక్షించాలని, భక్తులకు అందరికీ దర్శన భాగ్యం ఉంటుందని భరోసా కల్పించమని సూచించారు. హోల్డింగ్ ఏరియా, పార్కింగ్ ప్రాంతాలు సక్రమంగా నిర్వహణ, పార్కింగ్ ప్రాంతంలో టాయిలెట్స్ ఏర్పాటు, స్ట్రేచర్స్, మెడికల్ టీమ్స్, మందులు సరిపడా ఏర్పాటు ఉండాలని సూచించారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తుల సంతృప్త స్థాయి పెరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. డ్రోన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ పక్కాగా ఉండాలని తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక టైమ్ స్లాట్ ఏర్పాటు చేయాలని, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దర్శనం చేయించాలని అన్నారు. ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ తగినంత బందోబస్తు ఏర్పాటు , మెడికల్ క్యాంపు ఏర్పాటు, హాస్పిటల్ టై అప్, శానిటేషన్ తదితర అంశాలు పక్కాగా ఉండాలని సూచించారు.
ఎంఎల్ఏ, ఈఓ మాట్లాడుతూ...13 రోజుల మహాశివరాత్రి కార్యక్రమాలలో క్యూ లైన్ నందు భక్తులకు లడ్డు ప్రసాదం ఉచితంగా అందరికీ అందిస్తామని, భక్తులకు వాటర్ బాటిల్ ప్రతి ఒక్కరికి అందిస్తామని ఎంఎల్ఏ, ఈఓ వివరించారు.సుమారు 400 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 27వ తేదీన శ్రీకాళహస్తి స్థానికులకు టికెట్ ధర లేకుండా ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఈ నెల 25న ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గతంలోనే మూడు సార్లు సమన్వయ సమావేశం నిర్వహించామని తెలిపారు.
సమావేశానికి ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి స్వామి వారిని,అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం పలుకగా ఆలయ ఈ.ఓ బాపిరెడ్డి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!