హృదయ మది

- February 17, 2025 , by Maagulf
హృదయ మది

ఇసుమంత స్వార్ధంలేని స్వఛ్ఛమైనది                                                                                        ఇచ్చి పుచ్చుకోవడంలో అందంగా దాగినది
ఇరు మనసుల ఉఛ్వాస నిశ్వాస స్పందనది 
ఇంకిపోదు ఎంతదూరమైన పరిగెత్తమనేది
ఇది అని తెలుపలేక అనుక్షణం తల్లడిల్లుతుంది 
ఇధ్ధరిలో రహస్యాలకి తావేలేదనేది....

ఎటుచూసినా నీవే నేను నేనే నీవంటుంది 
ఎటుచూస్తే అటు నీరూపమే నంటుంది 
ఏవేవో తీయనైన ఊహాలతో తడిమేది 
ఎంతో ఆనందంతో మనసుని మైమరిపించేది
ఏవేవో కలలని కనుపాపలో నిలిపే ఆరాధనది
ఎదను పదే పదే‌ మీటే అనురాగ సరాగమది....

నిన్ను నన్ను కలిపిన మది ఆరాటమది
నిన్ను వదలి వెళ్ళలేననే నీదేననే మనసది 
నిన్ను పరిచయం చేసిన సరికొత్త పరిచయమది 
నిన్ను తలచుకునేలా చేసేటి తలపుల పరవశమది
నిన్ను కలిసే ప్రతిక్షణం వేచిచూస్తాననే నీ ప్రాణమది..

మనసు పొరల్లో అనునిత్యం స్పృజించేది
మనసున నీ కోసమే పరితపించే సంఘర్షణది
మనసు చాటున దాగి ఉండే జన్మబంధమది
మనసులు కలిసాక నీకై అర్పించిన హృదయమిది..

--యామిని కోళ్ళూరు(అబుధాబి)
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com