అమెరికన్లకు హాని చేయాలనీ చూస్తే సహించేది లేదు: కాష్ పటేల్
- February 21, 2025
అమెరికా: భారత సంతతికి చెందిన కాష్ పటేల్ అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) 9వ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.గురువారం ఆయన నియామకాన్ని సెనేట్ ధ్రువీకరించింది.తన నియామకం గురించి కాష్ పటేల్ స్పందిస్తూ ఎక్స్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.అమెరికన్లకు హాని చేయాలనీ చూస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు.ఎఫ్‌బీఐకు తొమ్మిదవ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని గురువారం(అమెరికా కాలమానం ప్రకారం) సెనేట్ ధ్రువీకరించింది. సెనేటర్ల ఓటింగ్‌లో కాష్ పటేల్‌కు మద్దతుగా 51 ఓట్లు, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. తన నియామకం గురించి కాష్ పటేల్ స్పందిస్తూ ఎక్స్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. “ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉంది. నాపై నమ్మకం ఉంచినందుకు పెసిడెంట్ ట్రంప్, అటార్నీ జనరల్ బోండికి ధన్యవాదాలు. “జీ-మెన్” నుంని 9/11 తర్వాత మన దేశాన్ని కాపాడటం వరకు ఎఫ్‌బీఐ కి ఒక చారిత్రాత్మక వారసత్వం ఉంది. అమెరికా ప్రజల కోసం ఎఫ్‌బీఐ పారదర్శకంగా, జవాబుదారీగా, న్యాయానికి కట్టుబడి ఉండాలి. రాజకీయాలు మన న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. కానీ అది నేటితో ముగుస్తుంది.
డైరెక్టర్‌గా నా లక్ష్యం.మంచి పోలీసులను పోలీసులుగా ఉండనివ్వాలి, ఎఫ్‌బీఐపై తిరిగి నమ్మకాన్ని తీసుకురావాలి. బ్యూరోలో అంకితభావంతో వారి భాగస్వామంతో అమెరికా ప్రజలు గర్వించదగిన ఎఫ్‌బీఐని మేం పునర్నిర్మిస్తాం. అమెరికన్లకు హాని కలిగించడానికి ప్రయత్నించే వారిని హెచ్చరిస్తున్నాను.. మీరు ఈ ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా మేం మిమ్మల్ని వేటాడతాం. మిషన్ ఫస్ట్. అమెరికా ఆల్‌వేస్.. లెట్స్ వర్క్” అంటూ కాష్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌బీఐ చైర్మన్ పోస్ట్ భారత సంతతికి చెందిన వ్యక్తి రావడంపై ఇండియాలో కూడా హర్షం వ్యక్తం అవుతోంది.
కాష్ పటేల్‌లో అమెరికాలోని న్యూయార్క్‌లో గల గార్డెన్ సిటీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన తల్లిదండ్రులు ఇండియాలోని గుజరాత్‌కు చెందిన వారు. కాష్ తల్లిదండ్రులు తొలుత ఉగాండాకు వెళ్లినప్పటికీ అక్కడ జాతి వివక్ష కారణంగా కెనాడాకు వెళ్లిపోయారు. కాష్ తండ్రి విమానయాన సంస్థ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కాష్ పటేల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. కాష్ రిచ్మండ్ యూనివర్సిటీ నుంచి హిస్టర్, క్రిమినల్ జస్టిస్‌లో డిగ్రీ పొందారు. అలాగే పేస్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జేడీ కూడా పొందారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్‌కు డిప్యూటీ అసిస్టెంట్‌గా, ఎన్‌ఎస్‌సీ(నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్)లో ఉగ్రవాద నిరోధన విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







