ICICI బ్యాంక్‌లో ఉద్యోగాలు..

- February 21, 2025 , by Maagulf
ICICI బ్యాంక్‌లో ఉద్యోగాలు..

ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలు పడ్డాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ బ్యాంకులో ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే బ్యాంకు నోటిఫికేషన్ విడుదల చేసింది.రిలేషన్‌షిప్ పోస్టుకు ప్రాంతాల వారీగా ఖాళీగా ఉన్నాయి.

ప్రత్యేకత ఏమిటంటే..బ్యాంకులో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 2 లక్షల నుంచి 12 లక్షల జీతం వస్తుంది.ఈ నియామకాలను ప్రధానంగా మధ్యప్రదేశ్ ప్రాంతానికి ప్రకటించారు. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ముందుగా ఐసీఐసీఐ వెబ్‌సైట్ (http://icicicareers.com)లో పూర్తి వివరాలను చెక్ చేయండి.

దరఖాస్తుకు అర్హతలివే:
ఐసీఐసీఐ బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగాలు మధ్యప్రదేశ్ కు సంబంధించినవి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి.దాంతో పాటు, బ్యాంకింగ్ రంగంలో ఒకటి నుంచి పది ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com