గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2025.. 22వ స్థానంలో ఖతార్..!!
- February 23, 2025
దోహా, ఖతార్: గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2025లో ఖతార్ ప్రపంచవ్యాప్తంగా 22వ స్థానంలో నిలిచింది. అరబ్ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. ఇది 193 దేశాలలో 173,000 మంది వ్యాపార నాయకులు, విధాన రూపకర్తలు, ప్రజల నుండి సేకరించిన గణాంకాల ఆధారంగా ర్యాంకులను కేటాయించారు.
బ్రాండ్ ఫైనాన్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఖతార్ నేషన్ బ్రాండ్ వాల్యుయేషన్ $270 బిలియన్లుగా ఉంది. యూఏఈ, సౌదీ అరేబియా రెండు గల్ఫ్ దేశాలు ఖతార్ పైన వరుసగా 10వ, 20వ స్థానాల్లో ఉన్నాయి.
ఖతార్ 100కి 54.5 గ్లోబల్ సాఫ్ట్ పవర్ స్కోర్‌ను అందుకోగా, యునైటెడ్ స్టేట్స్ 79.5 ఆల్ టైమ్ హై స్కోర్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మొదటి ఐదు స్థానాల్లో ఉన్న ఇతర దేశాలలో చైనా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, జర్మనీ ఉన్నాయి. ఎల్ సాల్వడార్ 2025లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ర్యాంక్ పొందింది. 35 స్థానాలు ఎగబాకి 82వ స్థానానికి చేరుకుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







