కువైట్ స్పోర్ట్స్ డేలో పాల్గొన్న 21వేల మంది..!!
- February 23, 2025
కైట్: కువైట్ స్పోర్ట్స్ డే రెండవ ఎడిషన్, పబ్లిక్ అథారిటీ ఫర్ స్పోర్ట్స్ ద్వారా షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబాహ్ కాజ్‌వేలో నిర్వహించిన స్పోర్ట్స్ డేలో 21వేలమంది పాల్గొన్నారు. ఈవెంట్‌లో 5 కి.మీ నడక రేస్, 20 కి.మీ సైక్లింగ్ రేసులో భాగంగా ఇక్కడ పోటీదారులు షువైఖ్ పోర్ట్ నుండి షేక్ జాబర్ కాజ్‌వే ప్రారంభం నుండి బ్రిడ్జి దక్షిణ ద్వీపం అయిన ముగింపు రేఖ వరకు కాలినడకన, సైకిళ్లపై బయలుదేరారు.
కువైట్ సమాచార శాఖ మంత్రి, యువజన వ్యవహారాల సహాయ మంత్రి అబ్దుల్‌రహ్మాన్ అల్-ముతైరీ రేసును అధికారికంగా ప్రారంభించారు. కువైట్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఫెడరేషన్ అధ్యక్షుడు మహమూద్ అబెల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మాజీ ప్రధాని షేక్ మహ్మద్ సబా అల్-సలేం వరుసగా రెండో సంవత్సరం సైక్లింగ్ రేసులో మాజీ మంత్రి దావూద్ మరాఫీతో కలిసి పాల్గొన్నారు. ఈవెంట్‌లో 20-కిలోమీటర్ల సైక్లింగ్ రేసు ఉంటుంది. దాని తర్వాత 5-కిలోమీటర్ల నడక ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్‌పాట్ డాక్టర్‌పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







