ప్రభుత్వ ఉద్యోగులకు రమదాన్ పని వేళలను ప్రకటించిన యూఏఈ..!!
- February 23, 2025
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసం కోసం యూఏఈ పనివేళలను ప్రకటించింది. మంత్రిత్వ శాఖలు , సమాఖ్య సంస్థల ఉద్యోగులకు అధికారిక వర్కింగ్ అవర్స్ ను ప్రకటించారు. పనివేళలు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30 గంటలకు ముగుస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఫార్) ప్రకటించింది.
ఇక శుక్రవారాల్లో, పని వేళలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని, వారి ఉద్యోగ స్వభావానికి ఇతరత్రా అవసరమయ్యే వారికి తప్ప ఈ సమయ నిబంధనలను వర్తించవని యంత్రాంగం తెలిపింది.
వీటితోపాటు ఆమోదించబడిన మార్గదర్శకాల ప్రకారం.. ఎంటిటీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 70 శాతానికి మించకుండా పరిమితితో రమదాన్ సందర్భంగా శుక్రవారం రిమోట్‌గా ఉద్యోగులు పని చేయడానికి వారు వెసులుబాటును మంజూరు చేసింది.
రమదాన్ నెలవంక కనిపించాక ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ముస్లింలు ఉపవాసం పారంభిస్తారు. మార్చి 1న రమదాన్ మాసం ప్రారంభమవుతుందని అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం (ఐఎసి) తెలిపింది. ఆ రోజున ఇస్లామిక్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో నెలవంక టెలిస్కోప్ ద్వారా కనిపించవచ్చని, అమెరికాలోని విస్తృత ప్రాంతాల్లో ఇది కంటితో కనిపిస్తుందని సెంటర్ డైరెక్టర్ మహ్మద్ షౌకత్ ఒదేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







