ప్రభుత్వ ఉద్యోగులకు రమదాన్ పని వేళలను ప్రకటించిన యూఏఈ..!!

- February 23, 2025 , by Maagulf
ప్రభుత్వ ఉద్యోగులకు రమదాన్ పని వేళలను ప్రకటించిన యూఏఈ..!!

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసం కోసం యూఏఈ పనివేళలను ప్రకటించింది. మంత్రిత్వ శాఖలు , సమాఖ్య సంస్థల ఉద్యోగులకు అధికారిక వర్కింగ్ అవర్స్ ను ప్రకటించారు.  పనివేళలు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30 గంటలకు ముగుస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఫార్) ప్రకటించింది.

ఇక శుక్రవారాల్లో, పని వేళలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని, వారి ఉద్యోగ స్వభావానికి ఇతరత్రా అవసరమయ్యే వారికి తప్ప ఈ సమయ నిబంధనలను వర్తించవని యంత్రాంగం తెలిపింది. 

వీటితోపాటు ఆమోదించబడిన మార్గదర్శకాల ప్రకారం.. ఎంటిటీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 70 శాతానికి మించకుండా పరిమితితో రమదాన్ సందర్భంగా శుక్రవారం రిమోట్‌గా ఉద్యోగులు పని చేయడానికి వారు వెసులుబాటును మంజూరు చేసింది. 

రమదాన్ నెలవంక కనిపించాక ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ముస్లింలు ఉపవాసం పారంభిస్తారు. మార్చి 1న రమదాన్ మాసం ప్రారంభమవుతుందని  అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం (ఐఎసి) తెలిపింది. ఆ రోజున ఇస్లామిక్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో నెలవంక టెలిస్కోప్ ద్వారా కనిపించవచ్చని, అమెరికాలోని విస్తృత ప్రాంతాల్లో ఇది కంటితో కనిపిస్తుందని సెంటర్ డైరెక్టర్ మహ్మద్ షౌకత్ ఒదేహ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com