రియాద్ లోని 15 స్వ్కేర్స్ కు సౌదీ రూలర్స్ పేరు..ఆదేశించిన కింగ్ సల్మాన్..!!

- February 24, 2025 , by Maagulf
రియాద్ లోని 15 స్వ్కేర్స్ కు సౌదీ రూలర్స్ పేరు..ఆదేశించిన కింగ్ సల్మాన్..!!

రియాద్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిపాదనను అనుసరించి సౌదీ అరేబియాలోని ఇమామ్‌లు, రాజుల పేర్లను రియాద్‌లోని 15 ప్రధాన కూడళ్లకు పెట్టాలని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 22న కింగ్‌డమ్ వార్షిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈమేరకు నిర్ణయించారు. గత మూడు శతాబ్దాలుగా దేశ పునాది, ఏకీకరణ, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సౌదీ పాలకుల వారసత్వాన్ని గౌరవించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.   

ఇమామ్ మొహమ్మద్ బిన్ సౌద్, ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్, ఇమామ్ సౌద్ బిన్ అబ్దులాజీజ్, ఇమామ్ అబ్దుల్లా బిన్ సౌద్, ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా, ఇమామ్ ఫైసల్ బిన్ టర్కీ, ఇమామ్ అబ్దుల్లా బిన్ ఫైసల్, ఇమామ్ అబ్దుల్లా బిన్ ఫైసల్,  కింగ్ అబ్దుల్ అజీజ్, కింగ్ సౌద్, కింగ్ ఫైసల్, కింగ్ ఖలీద్, కింగ్ ఫహద్, కింగ్ అబ్దుల్లా, కింగ్ సల్మాన్‌లతో సహా ఆధునిక రాజ్య నిర్మాణంలో భాగస్వామ్యులైన సౌదీ రాజుల పేర్లను పెట్టనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com