రానున్న 3 రోజులు ఏపీ ప్రజలు జాగ్రత్త

- February 24, 2025 , by Maagulf
రానున్న 3 రోజులు ఏపీ ప్రజలు జాగ్రత్త

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.వాయువ్య భారతదేశం నుంచి వస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.గత ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 38.5°C ఉష్ణోగ్రత నమోదైంది.వేసవికి ముందే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడం కొంత ఆందోళన కలిగిస్తోంది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో మరింత తీవ్రమైన ఎండలు నమోదయ్యే అవకాశముంది.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ప్రజలు డీహైడ్రేషన్, తలనొప్పి, ఒళ్లు పట్టేయడం లాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు.

వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి బట్టలు ధరించడం, విటమిన్ సమృద్ధిగా ఉండే పండ్లు, పదార్థాలు తినడం ఆరోగ్యానికి మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండే సమయాల్లో బయటికి వెళ్లకుండా ఉండడం, అవసరమైతే గొడుగు లేదా టోపీ వాడుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com