101, 102, 103 సినిమాలను ప్రకటించిన బాలకృష్ణ
- July 03, 2016
లెజెండ్ బాలకృష్ణ ఇప్పుడు మహా స్పీడుమీదున్నాడు. ప్రస్తుతం తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ... షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య తన 101, 102, 103 సినిమాలను వెల్లడించాడు. బాలకృష్ణ 101వ సినిమాను కృష్ణవంశీ డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం కృష్ణవంశీ...బాలయ్య బాబుతో చేసే సినిమాకు స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నాడట. కృష్ణవంశీ సినిమా అంటే వెరైటీగా ఉంటుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఆ అంచనాలకు తగ్గట్టే వంశీ స్టోరీని తయారు చేస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాదు... బాలకృష్ణ తను చేయబోయే 102, 103 సినిమాలను కూడా ప్రకటించేశాడు. ఇది విని బాలయ్య ఫ్యాన్స్ ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు. 102వ సినిమాకు బోయపాటి డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంటే, 103వ సినిమాను అనీల్ రావిపూడి తెరకెక్కించనున్నాడని టాక్. బాలయ్య వందో చిత్రం త్వరలో జార్జియాలో షూటింగ్ జరుపుకోనుండగా, జూలై 4న బాలయ్య మూవీ టీంతో కలవనున్నాడని సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







