రాజకీయ ధృవతార-మందాడి అనిల్ కుమార్ యాదవ్: స్పెషల్ స్టోరీ
- February 24, 2025
మందాడి అనిల్ కుమార్ యాదవ్...తెలంగాణ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక రాష్ట్ర నేతల్లో ఒకరు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించినప్పటికి తన స్వశక్తితో అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ అత్యున్నత సభగా పిలుచుకునే రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో బహుజన వర్గాల ప్రతినిధిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
మందాడి అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ నగరంలోని పురానపూల్ ప్రాంతంలో అంజన్ కుమార్ యాదవ్, నాగమణి దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తిచేశారు. తండ్రి అంజన్ కుమార్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ నగర కాంగ్రెస్ సీనియర్ నేత మరియు సికింద్రాబాద్ నుంచి రెండు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
తండ్రిని చూస్తూ పెరిగిన చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను కలిగి ఉండేవారు. తండ్రి అంజన్ కుమార్ అడుగుజాడల్లో నడుస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే కాంగ్రెస్ విద్యార్ధి విభాగం ఎన్.ఎస్.యూలో చేరి యూనివర్సిటీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత తెలంగాణ మొదటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జాతీయ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
యూత్ కాంగ్రెస్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పలు ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. 2018,2023లలో ముషీరాబాద్ నుంచి పోటీ స్వల్ప తేడాతో ఓటమి పాలైయ్యారు. అయితే, పార్టీ బలోపేతం కోసం అనిల్ చేసిన కృషిని గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం 2023లో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ అనిల్ పేరును 2024లో కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎంపీగా పంపించింది. ఎంపీగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని యూత్ అనిల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. అనిల్ లాంటి బహుజన వర్గానికి చెందిన యువనేత రాజకీయాల్లో తన స్వశక్తితో రాజకీయాల్లో ఎదుగుతూ ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంతో అనిల్ కృషి చేస్తున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







