షార్జాలో పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- February 25, 2025
షార్జా: రమదాన్ మాసం కోసం షార్జా పొడిగించిన పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ సమయాలను ప్రకటించింది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు పబ్లిక్ పార్కింగ్ ఫీజులు వర్తిస్తాయని షార్జా నగర మునిసిపాలిటీ తన ప్రకటనలో తెలిపింది.
నైబర్‌హుడ్ పార్కులు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని, అల్ సెయుహ్ ఫ్యామిలీ పార్క్, అల్ సెయుహ్ లేడీస్ పార్క్, షార్జా నేషనల్ పార్క్, అల్ రోల్లా పార్క్ సాయంత్రం 4 గంటల నుండి తెల్లవారుజాము 1 గంట వరకు పనిచేస్తాయని అథారిటీ తెలిపింది.
ఆహార సంస్థలను పర్యవేక్షించడానికి, తనిఖీ చేయడానికి సమగ్ర ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించినట్టు మునిసిపాలిటీ తెలిపింది. ఫుడ్ సేఫ్టీ ని పర్యవేక్షించడానికి 380 మంది ఇన్స్పెక్టర్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఇస్లామిక్ పవిత్ర మాసం మార్చి 1 ప్రారంభమవుతుందని, 30 రోజులు పాటు ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్‌పాట్ డాక్టర్‌పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!







