దుబాయ్ వీసా..ఇప్పుడు నివాసితులు నిమిషాల్లోనే పర్మిట్‌ను పునరుద్ధరించుకోవచ్చు..!!

- February 25, 2025 , by Maagulf
దుబాయ్ వీసా..ఇప్పుడు నివాసితులు నిమిషాల్లోనే పర్మిట్‌ను పునరుద్ధరించుకోవచ్చు..!!

దుబాయ్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) కొత్త AI-ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడంతో నివాసితులు ఇప్పుడు తమ వీసాను సులభంగా పునరుద్ధరించుకునే అవకాశం వచ్చింది. సలామా ప్లాట్‌ఫామ్ ద్వారానివాసితులు నిమిషాల్లోనే తమ వీసా పునరుద్ధరణను పూర్తి చేసుకోవచ్చు. వారు ప్లాట్‌ఫామ్ నుండి నేరుగా అప్డేట్ డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఈ ప్లాట్‌ఫామ్ కేవలం కొన్ని క్లిక్‌లతో కుటుంబ సభ్యుల కోసం రెసిడెన్సీ వీసాల పునరుద్ధరణను క్రమబద్ధీకరిస్తుంది. గతంలో, పునరుద్ధరణ ప్రక్రియ డాక్యుమెంట్ పరిపూర్ణతను బట్టి ఒకటి నుండి మూడు గంటల వరకు పట్టేదని డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ గలేబ్ అబ్దుల్లా మొహమ్మద్ హసన్ అల్-మాజిద్ తెలిపారు.అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అందజేస్తే కేవలం ఒకటి నుండి రెండు నిమిషాలలో మొత్తం ప్రాసెస్ పూర్తి అవుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం నివాసితుల వీసా పునరుద్ధరణలకు మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 'సలామా' AI ప్లాట్‌ఫామ్ దుబాయ్‌లో జీవన నాణ్యతను పెంచడానికి తాజా సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడానికి తమ నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుందని GDRFA దుబాయ్ జనరల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com