తెలుగు తప్పనిసరని ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

- February 25, 2025 , by Maagulf
తెలుగు తప్పనిసరని ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేర‌కు తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

9వ తరగతి విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి, 10వ తరగతి విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com