సినిమా రివ్యూ: ‘మజాకా’.!
- February 26, 2025
చాలా కాలంగా యంగ్ టాలెంటెడ్ హీరో అయిన సందీప్ కిషన్ ఓ సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ క్రమంలోనే పిచ్చ కాన్ఫిడెన్స్‌తో చేసిన సినిమా ‘మజాకా’. టాలెంటెడ్ డైరెక్టర్ నక్కిన త్రినాధరావు సినిమా కావడంతో అంచనాలు బాగానే వున్నాయ్ ఈ సినిమాకి. ప్రమోషన్లు బాగానే చేశారు. పాజిటివ్ టాక్ కూడా బాగానే వచ్చింది ఈ సినిమా రిలీజ్‌కి ముందు. ఇక, మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సందీప్ కిషన్ ఆశించినట్లుగా సక్సెస్ అయ్యిందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
వెంకట రమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీ కొడుకులు. కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది రమణకి. అప్పటి నుంచీ మళ్లీ పెళ్లి చేసుకోకుండా కొడుకును చూసుకుంటూ కాలం గడిపేస్తుంటాడు రమణ. ఇక, యుక్త వయసొచ్చిన కొడుక్కి పెళ్లి చేద్దామనుకుంటే, ఆడ దిక్కు లేని కుటుంబంలోకి అమ్మాయిని పంపించడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఈ క్రమంలోనే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అటు రమణ యశోద (అన్షు)తోనూ, ఇటు కృష్ణ మీరా (రీతూ వర్మ)తోనూ ప్రేమలో పడతారు. ఈ ఇద్దరి లవ్ ట్రాక్స్ ఇంట్రెస్టింగ్ ఫన్నీగా నడుస్తున్న క్రమం.. మొదట తంగ్రి పెళ్లి చేసుకుని ఆడ దిక్కును ఇంటికి తీసుకొచ్చి, కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటాడు రమణ. అన్నీ సెట్.. పెళ్లి చేసుకోవడమే తరువాయి.. అనేసరికి ఇద్దరు ఆడవాళ్లకి సంబంధించి ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు ఆ ట్విస్ట్ ఏంటీ.? యశోదకీ, మీరాకీ మధ్య లింకేంటీ.? భార్గవ్ వర్మ (మురళీ శర్మ)కీ ఈ కథకీ సంబంధమేంటీ.? తెలియాలంటే ‘మజాకా’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
ఈ సినిమాకి సందీప్రా కిషన్‌తో పాటూ రావు రమేష్ కూడా హీరోనే. కుర్రోడు సందీప్ కిషన్ ఎనర్జీతో రావు రమేష్ ఎనర్టీ మ్యాచ్ చేయడం చాలా గ్రేట్. సినిమా ఆధ్యంతం పోటీ పడి నటించాడు రావు రమేష్. ఎక్కడా తగ్గలేదు. ఇంతవరకూ రావు రమేష్ చేసిన పాత్రలన్నింట్లోకీ ఈ పాత్ర డిఫరెంట్. అందులోనూ సక్సెస్ అయ్యాడు. తనకు చాలా ఈజీ అయిన పాత్రలో ఎప్పటిలాగే అవలీలగా నటించేశాడు సందీప్ కిషన్. ‘మన్మధుడు’ హీరోయిన్ అన్షు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రావు రమేష్‌తో పెయిర్ కొన్ని చోట్ల ఎబ్బెట్టుగా అనిపించినా, ఆమ పాత్ర చిత్రీకరణ ఆ ఫీల్ కలగనివ్వదెక్కడ. రావు రమేష్ కూడా ఆ టెంపో అలా మెయింటైన్ చేయడం విశేషం. ఇక రీతూ వర్మకీ ఈ సినిమాలో ఓ మోస్తరు స్కోపున్న పాత్రే దక్కింది. ఆ పాత్రకు తనవంతుగా న్యాయం చేసింది. జబర్దస్త్ ఆది, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కనిపించినప్పుడల్లా తమ పంచ్ డైలాగులతో మ్యాజిక్ చేశారు. మురళీ శర్మకి కొత్త పాత్రేం కాకపోయినా ఆయన కూడా తన అనుభవం రంగరించి నవ్వించే ప్రయత్నమే చేశారు. మిగిలిన నటీనటులు వారి పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
ఈ సినిమాకి నిర్మాణ విలువలు బాగున్నాయ్. మ్యూజిక్ విషయానికి వస్తే, పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. స్టోరీలో మిళితమైపోతాయ్. సో, ప్రేక్షకుడి దృష్టి పెద్దగా డైవర్డ్ కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగులు ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. సెంటిమెంట్‌తో కూడిన డైలాగులు కొన్ని హత్తుకుంటాయ్. హ్యూమరస్ యాంగిలే అయినా డైలాగులు మాత్రం ఆలోచిపంచేస్తాయ్. ఎడిటింగ్‌లోనూ పెద్దగగా లోపాలు పట్టలేము. ఇక, డైరెక్టర్ నక్కిన త్రినాధనావుకు ఇదో కమ్ బ్యాక్ సినిమానే అని చెప్పొచ్చు. నిజానికి ఇలాంటి కథని ఎమోషనల్ యాంగిల్‌లో చెప్పాలనుకుంటారు. కానీ, ప్రేక్షకుడికి సరదా సరదాగా ఈ కథను కనెక్ట్ చేయాలనుకున్నాడు నక్కిన. ఆ విషయంలో హండ్రెడ్ పర్సంట్ సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఎబ్బెట్టుగా అనిపించినప్పటికీ నవ్కవుల బండితో కథనం నడిపించిన తీరుకు సినిమా ఎక్కడా బోర్ ఫీల్ కలిగించదు. అలాగే నాన్ స్టాప్ నవ్వులు పూయిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ పర్‌ఫామెన్స్, కామెడీ సన్నివేశాలు.. డైలాగులు..
మైనస్ పాయింట్స్:
కొన్ని చోట్ల కాస్త ఎబ్బెట్టుగా అనిపించిన రావు రమేష్, అన్షు లవ్ ట్రాక్..
చివరిగా:
నవ్వుల ‘మజాకా’.! ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళితే, పక్కా పైసా వసూల్. పండగ వేళ హాయిగా నవ్వుకునే అసలు సిసలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.!
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







