దుబాయ్ గ్లోబల్ విలేజ్ వేళల్లో మార్పులు..!!
- February 26, 2025
యూఏఈ: దుబాయ్ గ్లోబల్ విలేజ్.. మార్చి 1 న ప్రారంభమయ్యే పవిత్ర రమదాన్ మాసంలో దాని పని వేళల్లో మార్పులు చేసింది. కొత్త ఆపరేటింగ్ వేళలను ప్రకటించింది. ఫామిలీ డెస్టినేషన్ ఉపవాస మాసంలో సాయంత్రం 5 నుండి ఉదయం 1 గంటల వరకు (ఆదివారం నుండి బుధవారం వరకు), సాయంత్రం 5 నుండి ఉదయం 2 వరకు (గురువారం నుండి శనివారం వరకు) తెరిచి ఉంటుందని తెలిపింది. ఈ పార్కును అద్భుతమైన రమదాన్ నేపథ్య అలంకరణలతో అలంకరించి, రమదాన్ అద్భుతాలకు నిలయంగా మారుస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన వేదిక పక్కన రమదాన్ ఫిరంగి కూడా ఉంటుందని, ఉపవాసం ముగింపుకు గుర్తుగా ప్రతిరోజూ సూర్యాస్తమయం సమయంలో కాల్చడం జరుగుతుందని ప్రకటించింది. రమదాన్ సందర్భంగా ముల్తాకా గ్లోబల్ విలేజ్ అని కొత్త వేదికను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇది ప్రధాన స్టేజ్, డ్రాగన్ లేక్ మధ్య పార్క్ నడిబొడ్డున ఉంటుందని పేర్కొంది. దీనితో పాటు, గ్లోబల్ విలేజ్ ఓర్నినా ఆర్ట్స్ ఈవెంట్స్ ద్వారా అరబెస్క్యూ ఆర్కెస్ట్రాను నిర్వహిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







