జెడ్డా పోర్ట్ నుండి సిరియాకు..డైరెక్ట్ షిప్పింగ్ రూట్ ప్రారంభం..!!

- February 26, 2025 , by Maagulf
జెడ్డా పోర్ట్ నుండి సిరియాకు..డైరెక్ట్ షిప్పింగ్ రూట్ ప్రారంభం..!!

రియాద్: జనరల్ అథారిటీ ఫర్ పోర్ట్స్ (మవానీ) సౌదీ అరేబియా,  సిరియా మధ్య మొదటి సముద్ర మార్గాన్ని ప్రారంభించింది. జెడ్డా ఇస్లామిక్ పోర్ట్‌లో కేరస్ కంపెనీ ద్వారా కొత్త డైరెక్ట్ షిప్పింగ్ సర్వీస్ EXS6ను ప్రారంభించింది.

EXS6 సేవ జెడ్డా ఇస్లామిక్ పోర్ట్‌ను టర్కీలోని ఇస్కెన్‌డెరన్ పోర్ట్, సిరియాలోని లటాకియా పోర్ట్‌తో కలుపుతుంది. ఇది 858 స్టాండర్డ్ కంటైనర్‌ల సామర్థ్యంతో వాణిజ్య అవసరాలను కూడా సులభతరం చేస్తుంది. దాంతో ఈ మార్గంలో దిగుమతి, ఎగుమతి కార్యకలాపాలను పెంచుతుందని భావిస్తున్నారు.

గ్లోబల్ షిప్పింగ్ నెట్‌వర్క్‌లలో సౌదీ అరేబియా స్థానాన్ని బలోపేతం చేయడానికి,  పోర్ట్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో కొత్త రూట్ సర్వీస్ భాగమని పేర్కొన్నారు. ఇది మూడు ఖండాలను కలుపుతూ సౌదీ అరేబియాను సెంట్రల్ లాజిస్టిక్స్ హబ్‌గా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్న నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ స్ట్రాటజీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com