కువైట్‌లో గత 60 ఏళ్లలో అత్యంత ‘కోల్డేస్ట్ డే’ రికార్డు నమోదు..!!

- February 26, 2025 , by Maagulf
కువైట్‌లో గత 60 ఏళ్లలో అత్యంత ‘కోల్డేస్ట్ డే’ రికార్డు నమోదు..!!

కువైట్: కువైట్‌లో 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత మంగళవారం(ఫిబ్రవరి 25) నమోదైందని వాతావరణ శాస్త్రవేత్త ఇస్సా రమదాన్ తెలిపారు. ఇస్సా రమదాన్ మాట్లాడుతూ.. మతరాబా,  సాల్మీ ప్రాంతంలో అధికారిక ఉష్ణోగ్రత -1 డిగ్రీగా నమోదైందని, అయితే గ్రహించిన ఉష్ణోగ్రత మతరబా ప్రాంతంలో -8 డిగ్రీల సెల్సియస్, సల్మీలో -6 డిగ్రీల సెల్సియస్ అని పేర్కొన్నారు.

కువైట్ నగరంలో గుర్తించబడిన ఉష్ణోగ్రత జీరో డిగ్రీలు అయితే అధికారికంగా నమోదు చేయబడిన ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ అని తెలిపారు. వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ డేటా ప్రకారం.. గత 60 ఏళ్లలో కువైట్ అనుభవించిన అత్యంత శీతలమైన ఫిబ్రవరి రోజులలో ఇది ఒకటిగా పరిగణిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com