రమదాన్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్..!!
- February 27, 2025
యూఏఈ: రమదాన్ మాసంలో ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్ కోసం కేటాయించారు. అయితే, పవిత్ర మాసంలో శుక్రవారం పరీక్షల షెడ్యూల్లు ఆమోదించని విద్యార్థులకు ఇది వర్తించదని యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మంత్రిత్వ శాఖ "కుటుంబంతో రమదాన్" కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. అంతకుముందు, రమదాన్ కోసం ప్రభుత్వ రంగ ఉద్యోగుల అధికారిక పని గంటలను కుదించారు. సోమవారం నుండి గురువారం వరకు పని వేళలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2.30 వరకు, శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. వేర్వేరు గంటలు పని చేసే ఉద్యోగులకు మినహాయింపులు వర్తిస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఫహర్) ప్రకటించింది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!