యూఏఈలో మార్చిలో ఇంధన ధరలు తగ్గుతాయా?

- February 27, 2025 , by Maagulf
యూఏఈలో మార్చిలో ఇంధన ధరలు తగ్గుతాయా?

యూఏఈ: ఫిబ్రవరిలో గ్లోబల్ చమురు ధరలు తక్కువగా బిజినెస్ చేయడంతో మార్చి నెలలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. పెట్రోలియం ఎగుమతి దేశాల చమురు ఉత్పత్తి చేసే గ్రూప్ ఆర్గనైజేషన్, దాని మిత్రదేశాలు (Opec+) ఏప్రిల్ 1 నుండి క్రమంగా చమురు ఉత్పత్తిని పెంచే ప్రణాళికను ప్రకటించిన తర్వాత గ్లోబల్ చమురు ధరలు ఈ నెల ప్రారంభంలో పడిపోయాయి. ఫిబ్రవరిలో బ్రెంట్ బ్యారెల్ సగటు $75తో పోలిస్తే గత నెలలో $77.55గా ఉంది.

యూఏఈలో సూపర్ 98 లీటరుకు 2.74 దిర్హామ్‌లు, స్పెషల్ 95 ధర 2.63 దిర్హాములు, ఇ-ప్లస్ ధర 2.55 దిర్హాములుగా ఉంది.  అమెరికా ముడి చమురు నిల్వల అనిశ్చితి కారణంగా ఇంధన మార్కెట్ మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితి వ్యాపారులు ఫ్యూచర్స్ మార్కెట్‌లో తమ లాంగ్ పొజిషన్‌లను తగ్గించుకోవడానికి దారితీసింది. ఇది WTI ధర తగ్గుదలకు కారణమైంది.  యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానం, వడ్డీ రేటు అంచనాలు వంటి స్థూల ఆర్థిక అంశాలు చమురు ధరల తగ్గదలను ప్రభావితం చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలమైన డాలర్ అంతర్జాతీయ కొనుగోలుదారులకు చమురును మరింత ఖరీదైనదిగా చేస్తుందని, ఇది డిమాండ్‌ను తగ్గిస్తుందని,ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు ఆంటోనియో డి గియాకోమో విశ్లేషించారు.

సెంచరీ ఫైనాన్షియల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ విజయ్ వాలెచా మాట్లాడుతూ.. హెడ్జ్ ఫండ్స్ ముడి చమురు అవకాశాలపై తక్కువ ఆశాజనకంగా మారుతున్నాయని, మార్కెట్ మెత్తబడటానికి మరింత సంకేతంగా నెట్-బుల్లిష్ బెట్‌లను తగ్గించిందని అన్నారు. ఉక్రెయిన్‌లో యుఎస్ టారిఫ్‌లు,  చర్చలు మార్కెట్ డైనమిక్స్‌ను ప్రభావితం చేయగలవని అన్నారు. దాంతోపాటు ఇరాకీ దాని సెమీ-అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతం నుండి ఎగుమతులు పునఃప్రారంభించవచ్చని, అయినప్పటికీ Opec+ ప్రణాళికాబద్ధమైన అవుట్‌పుట్ పెంపులను వాయిదా వేయవచ్చని వాలెచా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com