రమదాన్.. హెరిటేజ్ విలేజ్ ఈవెనింగ్స్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- February 27, 2025
మనామా: బహ్రెయిన్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి రూపొందించబడిన హెరిటేజ్ విలేజ్ ఈవెనింగ్స్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్‌ను ప్రారంభించినట్లు సమాచార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ పండుగ రాస్ హయాన్‌లోని హెరిటేజ్ విలేజ్‌లో జరుగుతుంది. రమదాన్ మొదటి రోజు నుండి సందర్శకులకు అనుమతిస్తారు. పవిత్ర మాసం 18వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.
దేశీయ పర్యాటకాన్ని పెంచుతూ బహ్రెయిన్ ప్రామాణిక సంప్రదాయాలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సందర్శకులను ప్రతిరోజూ 8:30 PM నుండి 1:00 AM వరకు అనుమతిస్తారు. "అల్ ముసాహెర్", "గెర్గావ్" ,"అల్ విదా", "డాక్ అల్ హబ్" వంటి రమదాన్ ఆచారాలను జరుపుకునే సాంప్రదాయ కళల ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయన్నారు. హెరిటేజ్ విలేజ్ స్థానిక దుకాణాలు, కేఫ్‌లు, ఫుడ్ స్టాల్స్‌తో పూర్తి సాంప్రదాయ మార్కెట్‌ను కూడా నిర్వహిస్తుందని, సందర్శకులకు రమదాన్ నేపథ్యంలో ప్రామాణికమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







