తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక..

- February 27, 2025 , by Maagulf
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక..

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతినెలా విశేష ఉత్సవాలు ఉంటాయి. అయితే, మార్చి నెలకు సంబంధించిన విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు వెల్లడించారు.

మార్చి నెలలో విశేష ఉత్సవాలు..
మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర.
9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.
10న మతత్రయ ఏకాదశి.
13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి
14న కుమారధారతీర్థం ముక్కోటి.
25న సర్వ ఏకాదశి
26న అన్నమాచార్య వర్ధంతి
28న మాస శివరాత్రి
29న సర్వ అమాస్య
30న శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు.

 తిరుచానూరు ఆలయంలో..

  • తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి.
  •  మార్చి 7, 14, 21, 28 తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
  • మార్చి 24న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45గంటలకు ఆలయ మాడ వీధుల్లో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
  • మార్చి 30న ఉగాది పర్వదినం సందర్భంగా సాయంత్రం 6గంటలకు అమ్మవారికి పుష్ప పల్లకీపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com