రాయలేని కావ్యం

- March 01, 2025 , by Maagulf
రాయలేని కావ్యం

సమ్మోహనాస్త్రం సంధించాలని వున్న సంధింఛలేని

జీవనాన ముక్తసరి పలకరింపులు .

ప్రతిక్షణం ఏదో తెలపాలని వున్న మదిగదిలోనే
ముంచేసే ఉపద్రవాలు.

గతమనే జ్ఞాపకాలు మాటున గుర్తొచ్చే గాయాలు
గూడుకట్టుకున్న బ్రతుకులు .

ప్రశాంత భావనతో ప్రతిక్షణం అందిపుచ్చుకోవాలనేలా
భావనజరులు .

అంతరంగాన స్వేచ్ఛగా విహరిస్తూ ఎదుర్కొనమనే 
ఎదురయ్యే ఆటుపోటులు.

వెన్నంటే సమ్మిళతమై కురిపించేను అధ్భుతమైన 
పరిమళాలు .

నిజాయితీ మంచితనం నడుమ నలుగుతున్న
మోసాలు చూసిన వేయలేని ప్రశ్నలు .

అబద్ధాన్ని నిజమని చెపుతూ చేయించేరు 
ఆనోట ఈనోట పుకారులు .

అరాచకం రాజ్యమేలుతూ నిజాన్ని సమాధిచేసే
నరరూప రాక్షసులు .

విజ్ఞానము వ్యాపారం కాదు ప్రగతిపథంలో
నడపించక కుమ్మరించేరు కాసులు .

స్వేచ్ఛని హరిస్తూ బాధ్యతని మరచి లోనయ్యే
క్షణికసుఖాలు .

అనాగరికంతో పేదలకి న్యాయంచేయక 
ప్రజాస్వామ్యంలో రాజ్యమేలే అవినీతులు .

నమ్మిన ప్రేమలో మోసం నిజంతెలిసిన నాటికి
నేలరాలుతున్న కుసుమాలు.

క్షణజీవనంలో  కలతలు ఆవేశాలు నయవంచనతో
మసిబారుతున్న మమకారాలు.

అన్నింటిని మౌనంగా లోలోన మూలుగుతూ భరిస్తూ
పుడమితల్లి కార్చే కన్నీటిచుక్కలు .


కవిమనసున పురుడు పోసుకున్న అక్షరాలు
కలం విదిలించమనే అమృతాక్షరాలు .

కదపాలని చెప్పాలని అణువణువునీ సంధించాలని
*రాయలేని కావ్యం* 

--యామిని కోళ్ళూరు(అబుదాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com