ప్రత్యేకమైన అనుబంధాన్ని తెలియజేసిన "మామ్ అండ్ మీ"..!!
- March 01, 2025
మనామా: భావన్స్ బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ వార్షిక "మామ్ అండ్ మీ" ఈవెంట్ తల్లి,పిల్లల మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో BIS కమ్యూనిటీ పేరెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ సృజనాత్మకత, శైలిని ప్రదర్శిస్తూ ర్యాంప్ వాక్‌లో మదర్స్ పాల్గొన్నారు. ఆ తర్వాత సరదా గేమ్‌లను ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ పేరెంట్, చిల్డ్రన్ జంటలకు బహుమతులు అందజేశారు.
BIS ప్రిన్సిపాల్ సాజీ జాకబ్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ బలమైన కుటుంబ సంబంధాలను పెంపొందించడానికి, తల్లిదండ్రులు - పిల్లలు కలిసి అర్ధవంతమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి ఒక వేదికను అందించిందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. బిఐఎస్ డైరెక్టర్లు రీతూ వర్మ, హిమాన్షు వర్మ మాట్లాడుతూ.. “తల్లులు, వారి పిల్లల మధ్య అమూల్యమైన బంధాన్ని జరుపుకోవడానికి ‘మామ్ అండ్ మి’ ఈవెంట్ మాకు ఒక అద్భుతమైన అవకాశం. మన సమాజంలో ప్రేమ, అనుబంధం, ఆనందాన్ని పెంపొందించే ఇలాంటి క్షణాలను సృష్టించడం చాలా అవసరం.’ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







