CT 2025: రేపే ఆఖ‌రి లీగ్ మ్యాచ్..

- March 01, 2025 , by Maagulf
CT 2025: రేపే ఆఖ‌రి లీగ్ మ్యాచ్..

దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా రేపు (మార్చి 2) చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్‌లో తలపడేందుకు టీమిండియా–న్యూజిలాండ్ జట్లు (Group A) సిద్ధంగా ఉన్నాయి.

కాగా, ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇరు జట్లకి ఇది నామమాత్రపు మ్యాచ్. అయితే, రేపు దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ లో విజయం సాధించి… గ్రూప్ దశను విజయంతో ముగించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దాంతో భారత్–న్యూజిలాండ్ జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

అయితే ఈ మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్ అయినపట్టికీ.. సెమీఫైనల్‌లో ఏ జట్టు ఎవరితో తలపడాలనేది ఈ మ్యాచ్‌లో తేలనుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. బలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉండటంతో పాటు వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్నాయి. దాంతో ఆ పోరు ఆసక్తికరంగా సాగనుంది.

భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

పిచ్ రిపోర్ట్:
దుబాయ్ పిచ్ నెమ్మదిగా ఉండనుంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. డ్యూ వస్తే మాత్రం ఛేజింగ్‌ టీమ్‌కు అనుకూలంగా మారుతోంది. మంచు ప్రభావం లేకుంటే మాత్రం పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా మారుతోంది. మ్యాచ్ సాగుతున్నా కొద్ది వికెట్ల స్లో‌గా మారుతోంది. డ్యూ లేకుంటే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com