పెదపాలపర్రు: ఉత్సాహభరిత వాతావరణంలో 1987 పూర్వవిద్యార్ధుల సమ్మేళనం

- March 01, 2025 , by Maagulf
పెదపాలపర్రు: ఉత్సాహభరిత వాతావరణంలో 1987 పూర్వవిద్యార్ధుల సమ్మేళనం

అమరావతి: గ్రామం అభవృద్దికి అండదండలు అందిస్తామని పెదపాలపర్రు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్ధులు ముందుకు వచ్చారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలోని ఈదర శోభనాద్రి చౌదరి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1987 సంవత్సరంలో పదవతరగతి చదివిన పూర్వవిద్యార్ధులు సమావేశం అయ్యారు. అడిపాడారు. కబుర్లతో కాలక్షేపం చేసారు. అనాడు తరగతిలో చేసిన అల్లర్లను నెమరవేసుకున్నారు. ఇప్పడు ఏవరు ఏస్దాయిలో ఉన్నారన్న దానిపై చర్చించారు. నాటి పదవతరగతి బృందంలోని వారు అన్ని విధాలా సౌకర్యవంతమైన జీవనం గడిపేందుకు పరస్సరం సహకరించుకోవాలని భావించారు. పాఠశాల బాగోగులు చర్చించారు. అక్కడ వసతుల కల్పన పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోవటంతో, తమ వంతుగా గ్రామాభివృద్దిలో భాగస్వాములు కావాలని నిర్ణయించారు. రక్షిత మంచినీటి సరఫరా పధకం సక్రమంగా పనిచేయకపోవటం, బస్సు షెల్టర్ పునర్ నిర్మాణం, జాతీయ రహదారి వెంబడి మెక్కలు పెంచటం, నిరుపేద విద్యార్ధులకు అర్దిక సాయం వంటివి చర్చకు వచ్చాయి. పూర్వ విద్యార్ది బొప్పన నాగభూషణం మాట్లాడుతూ పూర్వ విద్యార్దుల సంఘంతో కలిసి పనిచేయటానికి తమ ఆద్వర్యంలోని బొప్పన బాబురావు ట్రస్ట్ సిద్దంగా ఉందని, వ్యయం విషయంలో వెనుకాడవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గ్రామఅభివృద్దిలో భాగస్వామలు అయ్యే విషయంలో ఈదర సీతారామయ్య చొరవ తీసుకోవాలని గ్రామ బాద్యులతో సంప్రదింపులు జరిపి ఏ కార్యక్రమం చేపట్టాలన్న దానిని నిర్ణయించాలని ఈ భేటీ తీర్మానించింది. సీతారామయ్య ఇప్పటికే గ్రామంలో పలువురు నిరుపేద విద్యార్ధులకు ఫీజులు చెల్లింపు, పుస్తకాల పంపిణీ వంటివి చేపడుతుండగా, సమావేశం అభినందనలు తెలిపింది. విదేశాలలో స్ధిరపడిన నెక్కంటి వెంకట చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్దితులలో అమెరికా ప్రయాణం శ్రేయస్కరం కాదని, అయితే పూర్తి స్దాయి డాక్యుమెంటేషన్ తో వచ్చే వారికి ఇబ్బందులు లేవని వివరించారు. కార్యక్రమంలో బొప్పన శ్రీనివాస్, రామ్ మెహన్, వేణు గోపాల్, నాగేంద్రబాబు, సంకురాత్రి శ్రీను, జగన్నాధం, బొప్పన రవికుమార్, ఉమ, ఉష, నాగలక్ష్మి, లక్ష్మి రాణి, రమ, శ్రీదేవి, పద్మ, రంగనాయకమ్మ, లక్ష్యి కుమారి, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com