యూఏఈలో రమదాన్: వాహనదారులకు కీలక అలెర్ట్ జారీ..!!

- March 02, 2025 , by Maagulf
యూఏఈలో రమదాన్: వాహనదారులకు కీలక అలెర్ట్ జారీ..!!

యూఏఈ: ఈపవిత్ర రమదాన్ మాసంలో ట్రాఫిక్ ప్రమాదాలు సాధారణంగా పెరుగుతాయి.  ప్రత్యేకించి ఇఫ్తార్ ముందు గంటల సమయంలో రోడ్డుపై మరింత మరింత జాగ్రత్తగా ఉండాలని వాహనదారులకు అలెర్ట్ జారీ చేశారు."రమదాన్ చాలా ప్రత్యేకమైన సమయం. అదే సమయంలో ట్రాఫిక్‌ పరంగా అనేక సవాళ్లను తెస్తుంది. ఇతర నెలలతో పోలిస్తే ఈ నెలలో ఎక్కువ ప్రమాదాలు జరగడం గమనించవచ్చు.”అని RoadSafetyUAE వ్యవస్థాపకుడు, ఎండీ థామస్ ఎడెల్మాన్ తెలిపారు.  RoadSafetyUAE ప్రముఖ ఆటో ఇన్సూరెన్స్ కంపెనీల రమదాన్ సమయంలో నమోదైన క్లెయిమ్‌లను విశ్లేషించి, కొన్ని సంవత్సరాలుగా నమోదవుతున్న రోడ్డు ప్రమాదాలపైన విశ్లేషణలతోకూడిన నివేదికను విడుదల చేసింది.  

అధ్యయనం ప్రకారం.. చాలా ప్రమాదాలు రోజులో ఇఫ్తార్ ముందు సమయంలో 1pm నుండి 4pm (35 శాతం) మధ్య జరుగుతున్నాయి. దీని తర్వాత ఉదయం 9 నుండి 12 గంటల వరకు (21 శాతం) రద్దీగా ఉంటుంది. బుధవారాలు వారంలో అత్యంత ప్రమాదకరమైన రోజు. వారాంతాల్లో సురక్షితమైనవి. 30-39 సంవత్సరాల వయస్సు గల వాహనదారులు ఎక్కువగా ప్రమదానికి గురవుతున్నారు.  తరువాత 40-49 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారు.  

మానసిక, శారీరక సవాళ్లు

ఇఫ్తార్ ముందు రద్దీ సమయంలో జరిగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానసిక, శారీరక సంబంధిత సమస్యల కారణంగా జరుగుతున్నాట్లు ఎడెల్మాన్ వివరించారు.  రమదాన్ ఉపవాసాలు శరీరంపై ప్రభావాలను చూపుతుందన్నారు. ఉపవాసం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుందని, ఇది మన శ్రద్ధ, ఏకాగ్రత, దృష్టి సంబంధిత చర్యలను ప్రభావితం చేస్తుందన్నారు.   వాహనదారులు, పాదచారులు, మోటార్‌సైకిల్ రైడర్లు, సైక్లిస్టులు మొదలైనవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు.

-మీ షెడ్యూల్‌లను సరిగ్గా ప్లాన్ చేయండి. పరుగెత్తడం లేదా వేగంగా వెళ్లడం అవసరం లేకుండా ముందుగానే బయలుదేరండి.

- ఎల్లప్పుడూ రక్షణాత్మకంగా డ్రైవ్ చేయండి.

-ఎల్లప్పుడూ మీ సీట్ బెల్ట్ ధరించండి.

-ఇఫ్తార్‌కు ముందు రోడ్ల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

-వారి వాహనం మధ్య తగినంత దూరం ఉంచండి. టెయిల్‌గేట్ చేయవద్దు.

- ఇఫ్తార్ సమయంలో సిగ్నల్స్ ను జాగ్రత్తగా పాటించాలి. సిగ్నల్ జంప్ చేయకూడదు.  

- ఇఫ్తార్‌ సమయంలో రోడ్లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

- తగినంత నిద్ర పొవాలి. మగతగా ఉంటే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి.

-అవసరమైతే ప్రజా రవాణా లేదా టాక్సీలను ఉపయోగించండి.

-పరధ్యానంగా డ్రైవ్ చేయవద్దు.

-ఉపవాసం ఉన్న ఇతర వ్యక్తుల పట్ల ఉదారంగా ఉండండి.

-అత్యంత ప్రమాదకరమైన ఉదయం రద్దీ సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com