యూఏఈలో 30% పెరిగిన ఇఫ్తార్ బఫే రేట్లు..!!
- March 02, 2025
యూఏఈ: యూఏఈలోని రెస్టారెంట్లు ఇఫ్తార్ బఫే రేట్లను 30 శాతం వరకు పెంచాయి. పదార్థాల ధరలు, అద్దెలు పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని రెస్టారెంట్ల యజమానులు తెలిపారు. ఈ సంవత్సరం రమదాన్ సందర్భంగా ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఎక్కువ మంది ప్రజలు భోజనాన్ని ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. యూఏఈ అంతటా ఉన్న రెస్టారెంట్లు ముస్లింల నుండి డిమాండ్‌ను తీర్చడానికి ఉపవాస నెలలో ఇఫ్తార్ మరియు సుహూర్ బఫే కోసం ప్రత్యేక వంటకాలను అందిస్తాయి. కార్పొరేట్లు.. వ్యక్తులు, కుటుంబాల ఇఫ్తార్, సుహూర్ కోసం రెస్టారెంట్లు, రమదాన్ టెంట్లను బుక్ చేస్తున్నారు. ఈ సంవత్సరం, యూఏఈ అంతటా ఇఫ్తార్ బఫెట్ల ధరలలో పెరుగుదల నమోదైనట్లు యూఏఈ రెస్టారెంట్ల గ్రూప్ (UAERG) వైస్ చైర్మన్ అమిత్ నాయక్ అన్నారు. రమదాన్ రెండో వారం నుంచి సగటున 30 శాతం ధరలు పెరగవచ్చని మెజెస్టిక్ హోటల్స్, ది పర్మిట్ రూమ్, ధాబా లేన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎటి భాసిన్ తెలిపారు. కమోడిటీ ఉత్పత్తులలో స్థిరమైన పెరుగుదల, పెరుగుతున్న అద్దెలు ఇఫ్తార్ బఫే రేట్ల పెరుగుదలకు కారణమని వారు పేర్కొన్నారు. అద్దెలు ఆల్ టైమ్ హైలో ఉండటం, ఇంధన ధరలు 15 శాతం పెరగడం, కూరగాయల ధరలు 7 శాతం పెరగడంతో ధరలను సవరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







