'మోగ్లీ 2025' కోసం రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్ లో రెండు భారీ ఫైట్లు షూట్
- March 02, 2025
తన తొలి చిత్రం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్ రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 తో మరో ఎమోషనల్ పవర్ ఫుల్ నెరేటివ్ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తన తొలి చిత్రం బబుల్గమ్లో ఇంటెన్స్ యాక్షన్ కు ప్రశంసలు అందుకున్న రోషన్ కనకాల తన వెర్సటాలిటీ ప్రజెంట్ చేసే పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న మోగ్లీ 2025 అద్భుతమైన ఫారెస్ట్ నేపథ్యంలో జరిగే ప్రేమకథ. సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయికగా పరిచయం అవుతోంది.
మోగ్లీ 2025 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ 20 రోజుల క్రూషియల్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్ లో రెండు మ్యాసీవ్ యాక్షన్ బ్లాక్లను షూట్ చేశారు. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్ గా వుండబోతున్నాయి.
ఈ మూవీకి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రామ మారుతి. ఎం. సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కాల భైరవ సంగీతం సమకూరస్తున్నారు, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్మెంట్ను పర్యవేక్షిస్తున్నారు, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. రామ మారుతి ఎం. రాధాకృష్ణ రెడ్డి సహ రచయితలుగా ఉన్నారు.
ప్రతిభావంతులైన తారాగణం, టెక్నికల్ టీంతో రూపొందుతున్న మోగ్లీ 2025 సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
మోగ్లీ 2025 ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుంది.
తారాగణం: రోషన్ కనకాల, సాక్షి సాగర్ మడోల్కర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సందీప్ రాజ్
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: కాల భైరవ
డిఓపి: రామ మారుతి ఎం
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్: కిరణ్ మామిడి
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సుజిత్ కుమార్ కొల్లి
చీఫ్ కోఆర్డినేటర్: మేఘస్యం
యాక్షన్: నటరాజ్ మాడిగొండ
సహ రచయితలు: రామ మారుతి. ఎం & రాధాకృష్ణ రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







