SLBC సొరంగంలోకి స్వయంగా వెళ్లి సహాయక చర్యలు పరిశీలించిన సీఎం రేవంత్
- March 02, 2025
తెలంగాణ: శ్రీ శైలం ఎడమ గట్టు కాలువ (SLBC)లో కార్మికులు చిక్కుకుపోయిన చోట సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ అక్కడకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు వెళ్లారు. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ఘటనపై అధికారులతో రివ్యూ మీటింగ్ లోనూ వారు పాల్గొన్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలోకి స్వయంగా వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు.
ఎంత రిస్క్ అయినా సరే ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి, ఆపరేషన్‌ను ముందుకు తీసుకుపోవాలని అన్నారు.
మిగతా టన్నెల్ కంటే ఇది పూర్తి భిన్నమైన టన్నెల్ అని చెప్పారు. వెంటనే చేయవలసిన పనులపై నివేదిక ఇవ్వాలని అన్నారు. అధికారులతో సహాయక చర్యలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సీఎం, మంత్రులకు సహాయక చర్యల బృందం వివరించింది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్