ఆస్కార్‌-2025 విజేతలు వీరే..

- March 03, 2025 , by Maagulf
ఆస్కార్‌-2025 విజేతలు వీరే..

అమెరికా: సినీ ప్రియులు ఎంత‌గానో ఎదురుచూసిన ఆస్కార్ అవార్డ్స్ విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు. లాస్ ఏంజెల్స్ లో 97వ ఆస్కార్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.హాలీవుడ్‌లోని న‌టీన‌టుల‌తో పాటు సాంకేతిక నిపుణ‌లు, ఇంకా ఎంతోమంది ప్ర‌ముఖులు హాజ‌రు అయ్యారు.

ఉత్త‌మ న‌టుడిగా ది బ్రూట‌లిస్ట్‌లో న‌ట‌న‌కుగాను అడ్రియ‌న్ బ్రాడీ, ఉత్త‌మ న‌టిగా అనోరాలో న‌ట‌న‌కు మైకీ మ్యాడిస‌న్‌లు అవార్డులు అందుకున్నారు. ఇక ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ న‌టి, స్ర్కీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో అనోరా చిత్రానికి అవార్డులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ఫోటెలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఉత్తమ నటుడు–అడ్రియ‌న్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌)
ఉత్తమ సహాయ నటుడు–కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)
ఉత్తమ నటి–మైకీ మ్యాడిసన్‌ (అనోరా)
ఉత్తమ సహా నటి–జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్త‌మ ద‌ర్శ‌క‌త్వం–అనోరా (సీన్ బేక‌ర్‌)
ఉత్తమ చిత్రం–అనోరా
ఉత్తమ స్క్రీన్‌ప్లే–అనోరా (సీన్‌ బేకర్‌)
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే–కాన్‌క్లేవ్‌ (పీటర్‌ స్ట్రాగన్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌–వికెడ్‌ (పాల్‌ తేజ్‌వెల్‌)
ఉత్తమ మేకప్‌,హెయిర్ స్టైల్‌–ది సబ్‌స్టాన్స్‌
బెస్ట్ ఎడిటింగ్–అనోరా (సీన్‌ బేకర్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ–ది బ్రూటలిస్ట్‌ (లాల్‌ క్రాలే)
బెస్ట్ సౌండ్‌–డ్యూన్‌: పార్ట్‌ 2
బెస్ట్ ఒరిజినల్‌ స్కోర్‌–ది బ్రూటలిస్ట్‌ (డానియల్‌ బ్లమ్‌బెర్గ్‌)
బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌–ఎల్‌ మాల్‌ (ఎమిలియా పెరెజ్‌)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌-ది ఓన్లీ గర్ల్ ఇన్‌ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్–నో అదర్‌ ల్యాండ్‌                                                                బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్‌–డ్యూన్‌:పార్ట్‌2                                                                                ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌–ఐయామ్‌ స్టిల్‌ హియర్‌ బ (వాల్టర్‌ సాల్లెస్‌)                              ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌–ఫ్లో                                                                               ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌–ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌                                          ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌–ఐయామ్‌ నాట్‌ ఏ రోబో                                                      ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌–వికెడ్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com