దుబాయ్ పోలీసులు అదుపులో 9 మంది బెగ్గర్స్..!!
- March 04, 2025
దుబాయ్: బెగ్గింగ్ కు వ్యతిరేక ప్రచారంలో భాగంగా రమదాన్ మొదటి రోజున దుబాయ్ పోలీసులు తొమ్మిది మంది బెగ్గర్స్ ను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. దుబాయ్ పోలీసుల 'భిక్షాటనపై పోరాటం' ప్రచారంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లోని సస్పెక్ట్స్ అండ్ క్రిమినల్ ఫినామినా డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ సలేం అల్ షంసీ మాట్లాడుతూ.. దుబాయ్ ను బెగ్గింగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యల కారణంగా ఏటా బెగ్గర్స్ సంఖ్య తగ్గిందన్నారు.
యూఏఈలో బెగ్గింగ్ అనేది నేరంగా పరిగణిస్తారు. ఇందుకుగాను 5,000 దిర్హామ్‌ల జరిమానా, మూడు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. వారిని నియమించిన వారికి ఆరు నెలల జైలు శిక్షతోపాటు 100,000 దిర్హామ్‌ల జరిమానా విధిస్తారు. అదే సమయంలో అనుమతి లేకుండా నిధులను సేకరించడం చేస్తే 500,000 దిర్హామ్‌ల వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
బెగ్గర్స్ ను ప్రోత్సాహించవద్దని కోరారు. వారికి సంబంధించిన సమాచారాన్ని కాంటాక్ట్ సెంటర్ (901) లేదా దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్‌లోని 'పోలీస్ ఐ' సేవ ద్వారా నివేదించాలని కోరారు. అలాగే 'ఇ-క్రైమ్' ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ బెగ్గింగ్ కేసులను నివేదించాలని అల్ షంసి సూచించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







