ముఖ్యమంత్రులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖలు
- March 04, 2025
తిరుమల: దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు.ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని, దేవాలయాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ‘దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఆధ్యాత్మిక వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండాలి. దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు ఉండాలి. కోట్ల మంది భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్నారు.వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాం.మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







