నిధుల సేకరణలో ఆన్‌లైన్ ఫ్రాడ్.. గైడ్ లైన్స్ జారీ..!!

- March 04, 2025 , by Maagulf
నిధుల సేకరణలో ఆన్‌లైన్ ఫ్రాడ్.. గైడ్ లైన్స్ జారీ..!!

ఖతార్: నిధుల సేకరణలో ఆన్‌లైన్ మోసం పద్ధతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులను అధికారులు హెచ్చరించారు.ఈ మేరకు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB), నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (MoI), ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ రెగ్యులేటరీ అథారిటీ సంయుక్త సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.  దాతలను లక్ష్యంగా చేసుకుని, చట్టవిరుద్ధంగా నిధులను సేకరించే మోసపూరిత పథకాల బారిన పడకుండా ఉండటానికి మార్గదర్శకాలను షేర్ చేశారు.

మార్గదర్శకాలలో కొన్ని..:

- అధికారిక, గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల ద్వారా మాత్రమే విరాళం ఇవ్వండి.

- ఫోన్, ఇమెయిల్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విరాళాలను అభ్యర్థించే వ్యక్తులు లేదా గ్రూపుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

- మిమ్మల్ని మోసగించడానికి భావోద్వేగ విజ్ఞప్తులను ఉపయోగించే విరాళ అభ్యర్థనలకు స్పందించవద్దు.

అభ్యర్థన కేసులను నివేదించడానికి, ప్రతి ఒక్కరూ హాట్‌లైన్ 3361 8627 కు కాల్ చేయాలని లేదా మెట్రాష్ యాప్ - భద్రతా సేవలను ఉపయోగించాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com