యూపీఐ ద్వారా ఈపీఎఫ్ నగదు విత్ డ్రా
- March 06, 2025
న్యూ ఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి (EPF) నుంచి నగదు విత్ డ్రా మరింత సులభతరం కానుంది. బ్యాంక్ ఖాతాల నుంచి ఈపీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా నగదు ఉపసంహ రించుకునే సదుపాయం కల్పించనున్నారు. ప్రస్తుతం పీఎఫ్ నగదును విత్ డ్రా చేయాలంటే చాలా సమయం పడుతుంది. తిరస్కరణకు కూడా గురవుతుంటాయి. ఈ నేపధ్యంలోనే నగదు విత్ డ్రాను సులభతరం చేసేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకు వస్తోంది. ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఇటీవల ప్రకటించారు. జూన్ నాటికి ఈ సదుపాయం అందుబా టులోకి వస్తుంది. ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ ను ఉపసంహరించుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ (NPCI) తో ఈపీఎఫ్ ఓ చర్చలు జరుపుతోంది. ఈ సంవత్సరం మే, జూన్ నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..