అంతర్జాతీయ మహిళా దినోత్సవం....!
- March 08, 2025
మానవజాతి మనుగడకు ప్రాణం పోసే మహిళ.. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. అన్నింటా సగం అంటూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలు సాధిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మహిళల సాధికారతను చెప్పే విధంగా అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. అసలు ఈ స్పెషల్ డేని ఎందుకు జరుపుతున్నారు.. దాని వెనుకున్న ప్రాముఖ్యత, చరిత్ర ఏంటి? ఈ ఏడాది థీమ్ ఏంటి వంటి.. ఎలా దీనిని సెలబ్రేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు. స్త్రీ కుటుంబానికి కళ్ళు, ఇంటికి దీపం ఇల్లాలు.. ఒకప్పుడు నాలుగు గోడలకే పరిమితమైన మహిళలు నేడు అన్వేషించని రంగం లేదు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. తాను ఎంచుకున్న రంగంలో తమదైన ముద్ర వేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. తాము ఎవరికీ తీసిపోనని నిరూపించుకుంటున్నారు. వివిధ రంగాలలోని మహిళలు సాధించిన విజయాలను గుర్తించడానికి, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
1975 నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జర్మనీలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ మహిళా కార్యాలయం నాయకురాలు కార్ల జెట్ కిన్ అనే మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను సూచించింది. ప్రతి దేశంలో ప్రతి సంవత్సరం ఈరోజునే మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఆమె ప్రతిపాదించింది. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలతో సహా వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గౌరవిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.
వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అంతే కాకుండా ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను వాటి పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి వేదికగా పనిచేస్తుంది. లింగ సమానత్వం గురించి అవగాహన కల్పిస్తూ మహిళా సాధికారతకు మద్ధతు ఇస్తూ.. దీనిని ప్రతి ఏటా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని లక్ష్యం.
ప్రతి ఏడాది ఓ కొత్త థీమ్తో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది 'Accelerate Action' అనే థీమ్తో వస్తున్నారు. మహిళల పురోగతికి హెల్ప్ చేసే వ్యూహాలు, వనరులు, చొరవలను గుర్తించి.. వాటిని విస్తృతంగా, వేగంగా అమలు చేయాలనే ఉద్దేశాన్ని ఇది చెప్తుంది. అలాగే అన్ని రంగాల్లో లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం, మహిళలకు సాధికారత కల్పించడంపై ఇది అవగాహన కల్పిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కులను రక్షించేం లక్ష్యంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. చట్టపరంగా రక్షణ కల్పించడంలో మహిళల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేదికలపై చర్చిస్తారు. అందుకే ఈ స్పెషల్ డేకు ప్రపంచవ్యాప్తంగా విభిన్న దేశాల నుంచి మహిళలకు మద్ధతనందిస్తారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!