మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్
- March 09, 2025
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులకు ఇక నడపనున్నారు.
అలాగే, తెలంగాణలో స్వయం సహాయక బృందాలు నిర్వహించనున్న 64 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు కూడా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని అంగన్వాడీల్లో 14,000 టీచర్లు, హెల్పర్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహించింది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరా మహిళా శక్తి పాలసీని విడుదల చేసింది.
అంతకు ముందు హైదరాబాద్ కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో రూ.550 కోట్ల విలువైన కొత్త భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.
ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే వారి చిత్తశుద్ధిని నిరూపించుకుని స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!