సౌదీ మహిళలు ముందంజ.. 5.51లక్షల మంది బిజినెస్ ఓనర్లు..!!
- March 09, 2025
రియాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్.. వర్క్ ఫోర్స్, లీడర్షిప్ పొజిషన్స్, ఎంటర్ ప్రెన్యూర్షిఫ్ లో సౌదీ మహిళల పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తూ డేటాను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలో 9.8 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. 2024 మూడవ త్రైమాసికం నాటికి 36.2% మంది వర్క్ ఫోర్స్ లో పాల్గొంటున్నారు. సౌదీ మహిళల జనాభాకు ఉపాధి నిష్పత్తి 31.3%కి చేరుకుంది. ఇది వర్క్ ఫోర్స్ లో స్థిరమైన పురోగతిని ప్రతిబింబిస్తుంది. సౌదీ మహిళల జనాభా నిష్పత్తి 31.3%కి చేరుకుంది.
2024లో 78,356 మంది సౌదీ మహిళలు సీనియర్ మేనేజ్‌మెంట్ పదవులను నిర్వహించగా, 2023లో 551,318 మంది మహిళలు వ్యాపారాలను నమోదు చేసుకున్నారు. ఫ్రీలాన్సింగ్ కూడా పెరుగుతోంది. 2023లో 449,725 మంది సౌదీ మహిళలు ఫ్రీలాన్స్ వర్క్ పర్మిట్‌లను పొందారు. మరోవైపు పర్యాటక పరిశ్రమలో మహిళా ఉపాధిలో పెరుగుదల కనిపించింది. 2024లో 111,259 మంది సౌదీ మహిళలు పర్యాటక సంబంధిత ఉద్యోగాలలో పనిచేస్తున్నారని సర్వే నివేదికల్లో అందజేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!