ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ

- March 11, 2025 , by Maagulf
ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యంపై ఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నంత కాలుష్యం మన దేశంలోనే కాదు మరే దేశంలోని రాజధానుల్లో కూడా లేదని ఎప్పుడో తేలిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ టాప్ లో నిలిచింది. దీని వల్ల ఇక్కడ నివసించే ప్రజల ఆయుర్దాయం కూడా తగ్గిపోతున్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక 2024 వెల్లడించింది.

సగటున ప్రతీ 91.8 మిల్లీ గ్రాములకు 2.5 పీఎం చొప్పున ఢిల్లీలో కాలుష్యం ఉన్నట్లు ప్రపంచ వాయు కాలుష్య నివేదిక 2024 ప్రకటించింది. ప్రపంచంలోని 20 అత్యంత కలుషిత నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయి. అస్సాం-మేఘాలయ సరిహద్దులోని బైర్నిహాట్ అత్యంత కలుషితమైనదిగా ఈ నివేదిక తెలిపింది. ఇతర నగరాల్లో ఫరీదాబాద్ లోని ఘజియాబాద్ గుర్గావ్, గ్రేటర్ నోయిడా, భివాడి, నోయిడా, ముజఫర్‌నగర్, న్యూఢిల్లీ ఇలా చాలా ప్రాంతాలు కాలుష్యంలో మునిగి ఉన్నాయి.

భారత్ లో వాయు కాలుష్యం ప్రజల ఆయుష్షుపై తీవ్ర ప్రభావం
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన ఐదవ దేశంగా నిర్ధారణ అయింది. ఇక్కడ సగటు గాలి నాణ్యత సూచిక 50.6 గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక PM2.5 మార్గదర్శక విలువ 5 μg/m3 కంటే ఇది 10 రెట్లు ఎక్కువ. 2023లో ఇది మూడవ అత్యంత కలుషిత దేశంగా ఉండగా.. ఇప్పుడు ఐదో దేశంగా మారింది. అలాగే భారత్ లో వాయు కాలుష్యం ప్రజల ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల ప్రజల ఆయుష్షు ఐదేళ్లకు పైగా తగ్గిపోతోందని ఈ రిపోర్టు తెలిపింది. 138 దేశాలు, భూభాగాలు,, ప్రాంతాలలోని 8,954 ప్రదేశాలలో 40వేల కంటే ఎక్కువ వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల నుండి లభించిన డేటా ఆధారంగా ఈ రిపోర్టు తయారు చేశారు. దీనిని అంతర్జాతీయ వాయు నాణ్యత సూచికకు చెందిన వాయు నాణ్యత శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

ప్రపంచంలోని టాప్ ఏడు అత్యంత కలుషిత నగరాలు                                                  ఇందులో ప్రపంచ నగరాల్లో 17 శాతం మాత్రమే WHO వాయు కాలుష్య మార్గదర్శకాలను పాటించినట్లు తెలిపారు. 138 దేశాలు, ప్రాంతాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు పాటిస్తున్నాయి.దక్షిణాసియాలో ప్రపంచంలోని టాప్ ఏడు అత్యంత కలుషిత నగరాలు ఉన్నాయి. అలాగే తొమ్మిది అత్యంత కలుషితమైన ప్రపంచ నగరాల్లో ఆరు భారతదేశంలోనే ఉన్నాయి.అమెరికాలో అత్యంత కాలుష్య ప్రధాన నగరం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ గా గుర్తించారు. అమెరికాలో అత్యంత కాలుష్య నగరం కాలిఫోర్నియాలోని ఒంటారియో. ఆగ్నేయాసియాలోని ప్రతి దేశంలో PM2.5 సాంద్రతలు తగ్గాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com