ప్రొడ్యూసర్స్ ప్రశాంతి తిపిర్నేని& దీప్తి గంటా తో మాగల్ఫ్ ముఖాముఖి
- March 13, 2025
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్ చేస్తున్న మూవీ 'కోర్ట్'-స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలానే ప్రేమలో పాట కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. ప్రిమియర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.ఈ చిత్రం మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
దీప్తి కోర్టు జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
-నాని, ప్రశాంతి స్క్రిప్ట్ విని ఓకే చేశారు.నేను ఆన్సెట్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను. నేను రోజు సెట్స్ లో వుండేదాన్ని.నాని, ప్రశాంతి నాకు చాలా ప్రీడమ్ ఇచ్చారు.
కథ విన్నాక మీకు ఎలా అనిపించింది?
-నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను.డైరెక్టర్ జగదీష్ చాలా బాగా రాసుకున్నాడు.చాలా లేయర్స్ వున్నాయి. అన్నీ బాగా కనెక్ట్ చేసుకున్నాడు.స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉంటుంది. కథ నాకు చాలా నచ్చింది.
ప్రశాంతి వాల్ పోస్టర్ సినిమాలో కథ ఓకే అవ్వడం ఎలా వుంటుంది?
-నాని, నేను ఇద్దరం కథ వింటాం. అయితే మా నమ్మకం అంతా నాని గారి జడ్జిమెంట్ మీరే వుంటుంది. ఆన పెద్దగా లెక్కలేమీ వేయరు. ఒక కథ థియేటర్లో చూడాలనిపించేలా వుంటే ఓకే చేస్తారు.
ప్రశాంతి ప్రియర్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
-ప్రిమియర్స్ కి యునానిమస్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వచ్చింది.ఫస్ట్ అఫ్ చూసి 'వావ్' అన్నారు. సెకండ్ హాఫ్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. సెకండ్ హాఫ్ లోని హైలెట్స్ కూడా ఆడియన్స్ కి చాలా నచ్చాయి. రెస్పాన్స్ చాలా బావుంది. మేము అనుకున్నదాని కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి జోనర్ సినిమాని ఆడియన్స్ ఆదరించి బిగ్ సక్సెస్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది.ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాం.
-ప్రిమియర్స్ కి కొందరు లాయర్స్ కూడా వచ్చారు. వారికి చాలా నచ్చింది.ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఇంత నేచురల్ ప్రజెంట్ చేయడం ఇంతముందు చూడలేదని చెప్పారు. ఇది మాకు మంచి కాంప్లీమెంట్.
దీప్తి ..మీకు ఇందులో నచ్చిన పాయింట్స్ ఏమిటి?
-చాలా పాయింట్స్ వున్నాయి.రోహిణి క్యారెక్టర్ తో వచ్చే ఓ సీన్ చాలా నచ్చింది.అలాగే మంగపతి క్యారెక్టర్ లో శివాజీ గారు అద్భుతంగా చేశారు.ప్రతి ఇంట్లో అలాంటి ఓ క్యారెక్టర్ వుంటుంది.
డైరెక్టర్ జగదీశ్ గురించి?
డైరెక్టర్ జగదీశ్ ఈ సినిమాని చాలా రీసెర్చ్ చేసి రాశాడు.అందుకే సినిమా చాలా నేచురల్ గా వచ్చింది. పోక్సో చట్టం గురించి ఆయన చాలా డీటెయిల్ ప్రజెంట్ చేశాడు.
హిట్ 3 స్టేక్స్ చాలా పెద్దవి.. కానీ నాని గారు కోర్టు నచ్చకపొతే హిట్ 3 చూడొద్దని చెప్పడం ఎలా అనిపించింది?
-మాకు షాకే. నేను ప్రశాంతి డైరెక్టర్ శైలేష్ వంక చూశాం.(నవ్వుతూ) తనకి నమ్మకం వుంది కాబట్టే ఆ మాటని కాన్ఫిడెంట్ గా చెప్పారు.
ఈ సినిమా కోసం ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేశారు?
సెట్స్ పరంగా ఎక్కువ స్పెండ్ చేయలేదు కానీ ఈ కథకు మంచి యాక్టర్స్ కావాలి. ఆ విషయంలో రాజీ పడలేదు. ప్రియదర్శి తో పాటు రోహిణీ గారు, సాయి కుమార్ గారు, శివాజీ గారు, హర్ష వర్ధన్ గారు .. ఇలా మంచి యాక్టర్స్ వున్నారు. రోషన్ శ్రీదేవి కూడా వారి పాత్రలకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు.
ప్రశాంతి.. మీ కథల ఎంపిక ఎలా వుంటుంది?
-జానర్ ఏదైనా కథలో నిజాయితీ వుండాలి.కథలో హానెస్టీ, డైరెక్టర్ లో క్లారిటీ వుంటే ముందుకు వెళ్తాం. నాని గారు ఇదే చూస్తారు.
దీప్తి మీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు?
నేను 'మీట్ క్యుట్' చేసిన తర్వాత యు ఎస్ వెళ్ళిపోయాను.ఈ సినిమా కోసం మళ్ళీ వచ్చాను. కొన్ని ఐడియాలు వున్నాయి. వాటిని స్క్రిప్ట్ గా డెవలప్ చేయాలి.
తాజా వార్తలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- ‘ఫా9లా’ క్రేజ్.. త్వరలో ఇండియా టూర్‌కు ఫ్లిప్పరాచి..!!
- ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ పర్యటన.. ఖండించిన సౌదీ..!!
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్







