ఈ రమదాన్ లో ఉద్యోగ నియామకాలకు అధిక డిమాండ్..!!
- March 14, 2025
యూఏఈ: రమదాన్ సమయంలో యూఏఈలో రిక్రూట్ మెంట్ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. అనేక పరిశ్రమలు నియామకాలను వేగవంతం చేస్తున్నాయి. ఈ కాలాన్ని ఉద్యోగార్థులకు విలువైన అవకాశంగా మారుస్తున్నాయి. మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా (MENA) ప్రాంతంలోని 79.1 శాతం మంది నిపుణులు తమ జాబ్ సెర్చ్, వృత్తిపరమైన వృద్ధిపై దృష్టి పెట్టడానికి రమదాన్ నెలను ఉపయోగించుకుంటున్నారని Bayt.com నిర్వహించిన సర్వే వెల్లడించింది. తక్కువ పని గంటలు ఉన్నప్పటికీ, వ్యాపారాలు పెరిగిన వినియోగదారుల డిమాండ్‌కు సిద్ధమవుతున్నందున FMCG, F&B, లాజిస్టిక్స్, ఇ-కామర్స్, హెల్త్‌కేర్ వంటి పరిశ్రమలలో అధికంగా రిక్రూట్ మెంట్ జరుగుతుందని Bayt.com జనరల్ డైరెక్టర్ రామి లబాకీ తెలిపారు. ఉద్యోగార్థులకు రమదాన్ మంచి అవకాశంగా మారుస్తుందని హైలైట్ చేశారు.
రిక్రూటర్లు రమదాన్‌లో నియామకాలు చేసుకోవడమే కాకుండా ఈద్ అల్ ఫితర్‌కు ముందు అభ్యర్థులను ఖరారు చేయడానికి కూడా తొందరపడుతున్నారని జెనీ రిక్రూట్మెంట్ యజమాని మరియు మేనేజింగ్ డైరెక్టర్ నిక్కీ విల్సన్ చెప్పారు. ఈ సీజన్ కోసం వ్యాపారాలు పెరుగుతున్నందున, ముఖ్యంగా FMCG, F&B, సహాయక పాత్రలలో బలమైన నియామక కార్యకలాపాలను చూస్తున్నట్లు విల్సన్ అన్నారు.
69 శాతం మంది నిపుణులు రమదాన్ సమయంలో నియామకాలు వాస్తవానికి పెరుగుతాయని నమ్ముతున్నారని సర్వేలో తేలింది. వ్యాపార ఇఫ్తార్లు, సుహూర్ సమావేశాలు అద్భుతమైన నెట్వర్కింగ్ అవకాశాలను అందిస్తాయని రిక్రూటర్లు హైలైట్ చేస్తున్నారు. పని గంటలు తగ్గడంతో, ఉద్యోగార్థులు వ్యూహాత్మకంగా ఫాలో-అప్‌లను నిర్వహించాలని నిపుణులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







