ఒడిలో పిల్లవాడు.. డ్రైవింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు..వెహికిల్ సీజ్..!!

- March 15, 2025 , by Maagulf
ఒడిలో పిల్లవాడు.. డ్రైవింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు..వెహికిల్ సీజ్..!!

దుబాయ్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన ఒడిలో పిల్లవాడిని ఉంచుకున్నందుకు అతడి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా చేయడం ద్వారా అతని ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నట్లు దుబాయ్ పోలీసుల వెల్లడించారు. ఈ మేరకు స్మార్ట్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘన కింద నమోదు చేసినట్టు తెలిపారు.

యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న..  145 సెం.మీ కంటే తక్కువ ఎత్తు ఉన్న పిల్లలు వాహనం ముందు సీటులో కూర్చోవడాన్ని నిషేధించారు.  ఈ నిబంధనను ఉల్లంఘించడం వల్ల పిల్లల భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.   

వాహనదారుడి ప్రాణానికి లేదా ఇతరుల ప్రాణాలకు లేదా వారి భద్రతకు ప్రమాదం కలిగించే విధంగా వాహనాన్ని నడిపితే Dh2,000 జరిమానాతో పాటు 23 బ్లాక్ పాయింట్లు, 60 రోజుల పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని పోలీసులు గుర్తుచేశారు. దుబాయ్ పోలీసులు రోడ్డు భద్రతను నిర్వహించడానికి ఏఐ ,స్మార్ట్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com