వాహనాలు ఢీ.. అల్ ఖైల్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్..!!

- March 16, 2025 , by Maagulf
వాహనాలు ఢీ.. అల్ ఖైల్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్..!!

దుబాయ్: అల్ ఖైల్ రోడ్డులో పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షులు తమ సోషల్ మీడియాలో వెల్లడించారు. షార్జా వైపు వెళుతున్న వాహనాలు ఢీకొన్నట్లు వెల్లడించారు. దాంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని తెలిపారు. దాంతో తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఆలస్యం అయిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదం అనంతరం ఆ దిశలో ప్రయాణించే వాహనదారులకు 17 నిమిషాలు ఆలస్యం అయిందని వెల్లడించారు. దుబాయ్ హిల్స్ మాల్ దగ్గర నుండి బిజినెస్ బే వరకు 8.1 కి.మీ. దూరం ఈ ప్రమాదం వల్ల తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com