బహ్రెయిన్ మొదటి ఉపగ్రహం 'అల్-ముంథర్' సక్సెస్..సర్వత్రా హర్షం..!!
- March 16, 2025
మనామా: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. బహ్రెయిన్ మొదటి ఉపగ్రహం "అల్-ముంథర్" విజయవంతంగా ప్రయోగించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక మార్గదర్శక విజయంగా ప్రశంసించారు. ఈ మైలురాయి బహ్రెయిన్ రాజు, హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, స్థిరమైన అభివృద్ధికి తోడ్పడటానికి భవిష్యత్ శాస్త్రాలను ఉపయోగించుకోవాలనే దార్శనికతను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ప్రయోగం అంతరిక్ష పరిశోధనలో బహ్రెయిన్ వ్యూహాత్మక ఆశయాలకు నిదర్శనం మాత్రమే కాకుండా.. బహ్రెయిన్ ప్రతిభావంతుల అద్భుతమైన సామర్థ్యాలను కూడా హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో పాల్గొన్న బృంద సభ్యులను అభినందించారు. ఈ విజయవంతమైన మిషన్ అంతరిక్ష సాంకేతికత, ఆవిష్కరణలలో బహ్రెయిన్ ఆకాంక్షలకు కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని స్పష్టం చేశారు.
శనివారం ఉదయం స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా "అల్-ముంతిర్"ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది ఇప్పటికే తన మొదటి సంకేతాలను భూమికి పంపించడం ప్రారంభించింది. ఉపగ్రహం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ (NSSA)లోని గ్రౌండ్ స్టేషన్లు ధృవీకరించాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







